కమలాపూర్, సెప్టెంబర్ 14: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణం శనివారం జాతరను తలపించింది. పేరెంట్స్ విజిటింగ్ డే కావడంతో మైదానం కిటకిటలాడింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన తినుబండారాలు తీసుకొచ్చి, తినిపిస్తూ మంచి చెడులు తెలుసుకున్నారు.
పట్టుదలతో చదివి ఉతమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు పేరెంట్స్‌తో మాట్లాడుతూ ఆనందం పంచుకున్నారు. కాగా, కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల కోసం గేట్ వద్ద నిల్చొని ఎదురు చూశారు. వారు రాకపోవడంతో తెలిసిన తోటి స్నేహితుల తల్లిదండ్రుల వద్ద ఫోన్ తీసుకొని పేరెంట్స్‌తో మాట్లాడారు.