ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల
ఓపెన్ సూల్, ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,357 మంది అభ్యర్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కాగా 2,792 (83.17 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ సూల్ కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు.
- పదిలో 83.17, ఇంటర్లో 76.78 శాతం ఉత్తీర్ణత
హనుమకొండ చౌరస్తా, మే 30 : ఓపెన్ సూల్, ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,357 మంది అభ్యర్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కాగా 2,792 (83.17 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ సూల్ కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.72 శాతంతో రాష్ట్రంలో 2వ, మహబూబాబాద్ 91.72 శాతంతో 3వ, ములుగు 90.62 శాతంతో 5వ, హనుమకొం డ 89.04 శాతంతో 7వ స్థానంలో నిలువగా, జనగామ 79.46 శా తం, వరంగల్ 60.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అలా గే 6,568 మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాగా 5,174 (76.78 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
ములుగు జిల్లా 81.66 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, జయశంకర్ భూపాలపల్లి 81.51 శాతంతో 3వ, హనుమకొండ 80.66 శాతంతో 6వ, జనగామ 79.11 శాతంతో 8వ, మహబూబాబాద్ 79.06 శాతంతో 9వ స్థానం సాధించగా, వరంగల్ 69.62 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 2 నుంచి 7 వరకు www.telanganaopenschool.org లేదా Mee-Seva ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్మీడియట్ రీకౌంటింగ్కు రూ.400, ఎస్సెస్సీకి రూ.350 ఫీజు చెల్లించాలన్నారు. అలాగే రీ వెరిఫికేషన్ కోసం ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్కు రూ.1200 చెల్లించాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు 9346020003 నంబర్లో సంప్రదించాలని సదానందం కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

