హనుమకొండ చౌరస్తా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టెన్త్లో 69.04 శాతం, ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2478 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1711 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఇంటర్ పరీక్షలకు 4449 మంది అభ్యర్థుల హాజరు కాగా 2989 (67.17 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ వివరాలను ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎ సదానందం వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది పరీక్షలకు 269 మంది అభ్యర్థులు హాజరుకాగా 216 (80 శాతం) మంది, మహబూబాబాద్ జిల్లాలో 441 మంది అభ్యర్థులు హాజరు కాగా 337 (76 శాతం) మంది, వరంగల్ జిల్లాలో 478 మంది అభ్యర్థులు హాజరు కాగా 127 (26.7 శాతం) మంది, హనుమకొండ జిల్లాలో 390 మంది హాజరుకాగా 318 (81.6 శాతం), జనగామ జిల్లాలో 349 మంది హాజరు కాగా 293 (84 శాతం) మంది, ములుగు జిల్లాలో 553 మంది అభ్యర్థులు హాజరు కాగా 420 (76 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 349 మంది అభ్యర్థులు హాజరుకాగా 302 (76.6 శాతం) మంది, మహబూబాబాద్ జిల్లాలో 657 మంది హాజరుకాగా 488 (74.2 శాతం) మంది, వరంగల్ జిల్లాలో 650 మంది హాజరుకాగా 323 (49.7 శాతం) మంది, హనుమకొండ జిల్లాలో 997 మంది హాజరుకాగా 673(67.5 శాతం) మంది, జనగామ జిల్లాలో 942 మంది హాజరుకాగా 777 (82.48) మంది, ములుగు జిల్లాలో 809 మంది హాజరుకాగా 426 (51.6 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు కోఆర్డినేటర్ సదానందం ప్రకటించారు.