గీసుకొండ. ఏప్రిల్ 01: గ్రేటర్ వరంగల్ 16 డివిజన్ గొర్రెకుంట క్రాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెకుంట క్రాస్ రోడ్ డివైడర్ వద్ద మోటర్ సైకిల్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకొండకు చెందిన తరుణ్ (30) ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మామునూరు ఏసీపీ తిరుపతి, స్థానిక సీఐ మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చరికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.