నెల్లికుదురు మే 1: ఎదురు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన తులసాని విష్ణువర్ధన్ రెడ్డి(37) హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు.
కాగా, నెల్లికుదురు మండలంలోని సంధ్య తండా వద్ద ట్రాక్టర్ను బైకు ఢీకొట్టడంతో విష్ణువర్ధన్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.