కన్నకొడుకే పొమ్మన్నాడు
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
ఆస్తులు తీసుకుని తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కుమారుడు
వృద్ధురాలి గుడిసెను తొలగించి కొత్త ఇంటి నిర్మాణం
రెండు రోజులుగా అర్ధాకలితో చెట్టు కింద మగ్గుతున్న అవ్వ
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
చావే చరణ్యమంటూ రోదిస్తున్న వృద్ధురాలు
నల్లబెల్లి, మే 30 : పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఇంటి నుంచి గెంటేశాడో కుమారుడు. ఈ అమానవీయ ఘటన నల్లబెల్లి మండలంలో జరిగింది.
వృద్ధురాలి కథనం ప్రకారం.. మండలంలోని మేడెపల్లి గ్రామానికి చెందిన ముత్తోజు రాజమ్మ(68) కు ఇద్దరు కొడుకులు(ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి) ఇద్దరు కూతుళ్లు(స్వరూప, పద్మారాణి). భర్త బతికుండగానే కొడుకులు, కూతుళ్ల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపించింది. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో కుమారులకు చెరో ఎకరంఇచ్చి అర ఎకరాన్ని తన జీవనోపాధికై ఉంచుకున్నది. కాగా, గత ఏడాది పెద్ద కొడుకు వృద్ధురాలి అర ఎకరం భూమిని లాక్కొని ఆమె ఉంటున్న గుడిసెను సైతం కూల్చి వేసి ఇంటి నుంచి గెంటేశాడు. న్యాయం చేయాలని పలుమార్లు స్థానిక పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. పోలీసులు న్యాయం చేయకపోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో కొన్నాళ్లు చిన్న బిడ్డ దగ్గర ఉన్న వృద్ధురాలు అక్కడా ఆదరణ కరువవ్వడంతో దిక్కు తోచని స్థితిలో రెండు రోజులుగా మేడెపల్లి గ్రామ సమీపంలోని ఓ చెట్టు నీడన ఉంటున్నది. ఆమె పరిస్థితిని గమనించిన కొందరు బాటసారులు పండ్లు, ఆహారం, నీటిని అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజారాం వృద్ధురాలిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

