KCR | లింగాల ఘనపురం మండలంలోని గ్రామ గ్రామాన ముఖ్యంగా వృద్ధులు అయ్యా కేసీఆర్ మళ్లీ నువ్వే రావాలని కేసీఆర్ పోస్టర్లకు దండం పెడుతున్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాల్ పోస్టర్లు అతికించుకుంటూ అదే సమయంలో రజతోత్సవ సభ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. నాగారంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అనిల్ వాల్ పోస్టర్ వేస్తుండగా అక్కడికి వచ్చిన కొమరమ్మ.. కేసీఆర్ పోస్టర్‌కు నమస్కరిస్తూ అయ్యా మళ్లీ నువ్వే రావాలి అంటూ దండం పెట్టడం గ్రామస్తులను విపరీతంగా ఆకట్టుకుంది.