ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం
రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖానాపురం మండలకేంద్రానికి చెందిన రైతు గొల్లపూడి సుబ్బారావు తన 5.5 ఎకరాల భూమిలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టగా, పెద్ది బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా డ్రిప్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏటా లక్ష కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి
- ప్రభుత్వాలే గెలలను కొంటాయి..
- సాగులో తెలంగాణను రెండో స్థానంలో నిలిపేందుకు సర్కారు కృషి
- జిల్లాలో 10,230 ఎకరాల్లో సాగుకు దరఖాస్తులు
- వాట్సాప్ ద్వారా రైతులకు తాజా సమాచారం అందిస్తాం
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం, ఆగస్టు 24: రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖానాపురం మండలకేంద్రానికి చెందిన రైతు గొల్లపూడి సుబ్బారావు తన 5.5 ఎకరాల భూమిలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టగా, పెద్ది బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా డ్రిప్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏటా లక్ష కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే ప్రభుత్వాలు కచ్చితంగా గెలలను కొనుగోలు చేసి తీరుతాయాని భరోసా ఇచ్చారు. ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణను దేశంలో రెండో స్థానంలో నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. తక్కువ పెట్టుబడితో సాగు చేసే ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు ఆర్జించొచ్చని సూచించారు.
జిల్లాలో 10,230 ఎకరాల్లో సాగుకు దరఖాస్తులు రాగా, నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేటలో 496, దుగ్గొండిలో 940, ఖానాపురంలో 637, నల్లబెల్లిలో 658, నర్సంపేట రూరల్‌లో 629, నెక్కొండలో 613 ఎకరాల్లో సాగు కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ధరలు ఒకేరకంగా ఉంటాయని, దేశంలో ఆయిల్ దిగుమతి, ఎగుమతులు జరిగిన సమయంలో స్వల్ప తేడాలు వస్తాయన్నారు. నర్సంపేటలో దరఖాస్తు చేసుకున్న రైతులందరీతో త్వరలోనే ఆయిల్‌పామ్ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా వాట్సాప్‌లో గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయిల్‌పామ్‌పై తాజా సమాచారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్‌రావు, ఊడుగుల సునీత, హార్టికల్చర్ అధికారి తిరుపతి, ఏవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాస ప్రవీణ్‌కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు కవిత, భారతి, సర్పంచ్‌లు బాషబోయిన ఐలయ్య, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, సొసైటీ వైస్ ఛైర్మన్ వేణుకృష్ణ, ఏఈవోలు సంధ్య, సంతోష్, నాగమణి, జైన్ ఇరిగేషన్ ఏరియా మేనేజర్ భవానీప్రసాద్, రాంచరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

