భీమదేవరపల్లి, జూన్ 04 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. వధువు వివాహ వయస్సు తక్కువగా ఉందని తెలియడంతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ అనిత, సోషల్ వర్కర్ సునిత, ఏహెచ్ టీయు శ్రీనివాస్, రాజు, పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్ ఎస్సై సాయిబాబు తదితరులు వివాహం జరుగుతున్న ఇంటికి చేరుకున్నారు.
వధూవరుల కళ్యాణం నిలిపివేసి, మైనర్ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో వివాహం చేస్తే కలిగే అనార్థాలపై వివరించారు. ఆడపిల్లలను ఉన్నతంగా చదివించి యుక్త వయసు వచ్చేకే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. వీరితోపాటు పోలీసు సిబ్బంది యాకుబ్ పాషా, ఎన్జీవో జగన్ పాల్గొన్నారు.