రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్లకు రూ.415.64 కోట్ల ఆదాయం వచ్చింది.
- వ్యవసాయేతర రెవెన్యూ రూ.415.64 కోట్లు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్లు
- అత్యధికంగా వరంగల్ ఆర్వోలో, అత్యల్పంగా వర్ధన్నపేటలో..
- గతేడాది కంటే రూ.11.21 కోట్లు అధిక ఆదాయం
హనుమకొండ, ఏప్రిల్ 11 : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్లకు రూ.415.64 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం మీద గతేడాది కంటే రూ.11.21 కోట్లు ఎక్కువగా వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల్లో అత్యధికంగా వరంగల్ ఆర్వో కార్యాలయానికి 29,557 డాక్యుమెంట్ల ద్వారా రూ. 201.22 కోట్లు, అత్యల్పంగా వర్ధన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 1,594 డాక్యుమెంట్ల ద్వారా రూ.2.80 కోట్ల ఆదాయం వచ్చింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు వెంచర్లు పెరగడం, కొత్తగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసును ప్రారంభించడంతో ఆదాయం పెరిగిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
గతం కంటే రూ.11.21 కోట్లు అధికం
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో అపార్ట్మెంట్, విల్లాస్ కల్చర్‌తో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు, కాంప్లెక్స్ నిర్మాణాల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీలతో హౌసింగ్ రుణాలు అందిస్తుండడంతో మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవే రుతున్న సమయంలో నిర్మాణ రంగం సైతం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ డాక్యు మెంట్ల సంఖ్య పెరిగి ఆదాయం కూడా పెరిగిందనే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

