హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో వచ్చే వారం కీలకమైన అంశాలు చర్చకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ఈనెల 10,11,12 తేదీల్లో సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. రాజ్యసభ కాంగ్రెస్ చీఫ్‌విప్ జైరాం రమేశ్ తమ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీచేశారు.
ఉదయం 11 గంటల నుంచి సభ ముగి సే వరకు సభ్యులందరూ సభలో ఉండి పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులకు కూడా ఇదే విధమైన విప్ జారీచేశారు. వచ్చే వారం పార్లమెంట్లో విదేశీ విరాళాల చట్ట సవరణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీ సుకున్నది. నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది.