Nerella Venumadhav | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: మిమిక్రీ కళకే స్వరమాంత్రికుడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ వన్నెతెచ్చాడని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నాడు. నేరెళ్ల వేణుమాధవ్ 93వ జయంతి సందర్భంగా 5వ డివిజన్ హానుమాన్‌నగర్ ఫేజ్-1 కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తన మిమిక్రీ కళను ఓరుగల్లు ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన ఘనత నేరెళ్ల వేణుమాధవ్దేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో మొట్ల మనోహర్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, వెంకటేష్, రవికిరణ్, అవినాష్, రాంచెందర్, భార్గవ్, సాయి, సృజన్, కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.