హనుమకొండ, నవంబర్ 20: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సీసీ కేర్ టేకర్ వై.యశస్విని ఆధ్వర్యంలో 77వ ఎన్సీసీ డే ఉత్సవాలను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ 8(టీ) గర్ల్స్ బెటాలియన్ వరంగల్ కమాండింగ్ ఆఫీసర్ రవీంద్రకుమార్ రవి పాల్గొని మాట్లాడుతూ ఎన్సీసీ డేని ప్రతి సంవత్సరం నవంబర్ 23న జరుపుకుంటామన్నారు. ఎన్సీసీలో చేరిన విద్యార్థినులు ఎంతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారని, ఎన్సీసీలో చేరి సర్టిఫికెట్స్పొందడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు.
ఆర్మీలో చేరి దేశభద్రతలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ కే.బిక్షాలు మాట్లాడుతూ ఎన్సీసీ యూనిట్‌ను కాలేజీలో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఆత్మరక్షణ, దేశభక్తి, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం
తదితర అంశాలు ఈ ఎన్సీసీ ద్వారా విద్యార్థినులకు అలవడుతాయన్నారు. కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూర్పాటి వెంకటేష్, కాలేజీ సూపరింటెండెంట్ వీరునాయక్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్పాల్గొన్నారు.