హనుమకొండ రస్తా, సెప్టెంబర్ 12: జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్కాలేజీ హిందీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం పూర్వ ఆచార్యులు సంజీవ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ఆరువేల మిలియన్ ప్రజలు మాట్లాడుతున్నారని, ఇది ప్రపంచ భాషగా ఎక్కువగా గుర్తింపు పొందిందన్నారు.
అంతేకాకుండా పరిపాలకులు ఎవరూ ఉంటే వారి అనుకూలమైన భాషను రాజభాషగా అమలు పరుస్తారని, భారతదేశాన్ని ఆంగ్లేయులు, ముస్లింలు పరిపాలించినప్పుడు వారివారి పరిపాలన కాలంలో పరిపాలనకు అనుకూలమైన భాషను అధికార భాషగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, హిందీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి, విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పరహాఫాతిమా, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.