హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 17 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ పోటీలు రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగాయి. పతకాలే లక్ష్యంగా పోరాడుతున్న క్రీడాకారులు గత రికార్డులను తిరగరాస్తున్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభ కనబర్చారు. శుక్రవారం ఉదయం 20 వేల వాక్, ట్రిపుల్ జంప్, 1500, 110 మీటర్స్ హార్డిల్స్, డిసస్త్రో, 100 మీటర్స్ హార్డిల్స్, జావెలిన్‌త్రో, 200 మీటర్ల పరుగుపందెం, హైజంప్ , పోల్‌వాల్ట్ పోటీలు నిర్వహించారు.
సాయంత్రం డిసస్త్రో, హైజంప్, షార్ట్‌పుట్, పోల్‌వాల్ట్, 100, 110 మీటర్స్ హార్డిల్స్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలి న్ త్రో, 800, 1500 మీటర్ల పరుగుపందెం పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, చైర్మన్ వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోత్ అశోక్ కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్ర టరీ పగిడిపాటి వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు మెడల్స్ అందజేసి అభినందించారు. కాగా రెండోరోజు 13 ఈవెంట్లు నిర్వహించగా, 20 వేల మీటర్ల మెన్స్ రేస్‌వాక్‌లో ఆర్మీ విభాగానికి చెందిన సచిన్ బొహర(1:26:59.83) కొత్త రికార్డు నమోదు చేశాడు. 2022లో రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌కుమార్(1:27:14) పేరు మీద ఉన్న రికార్డును చెరిపేశారు.
20 వేల మీటర్ల ఉమెన్స్ రేస్‌వాక్‌లో మహిమ చౌదరీ(గోల్డ్, రాజస్థాన్), ఆర్తి(సిల్వర్, హర్యానా), కోమల్పాల్(బ్రాంజ్, మధ్యప్రదేశ్), మెన్స్‌లో సచిన్ బొహర(గోల్డ్, ఆర్మీ ), రోషన్ కుమార్(స్విలర్, జార్ఖం డ్), హిమాన్షుకుమార్(బ్రాంజ్, ఉత్తరఖండ్), 1500 మెన్స్ పరుగుపందెంలో ప్రభ్‌జోత్ సింగ్ (గోల్డ్, పంజాబ్), వికాష్ (సిల్వర్, హర్యా నా), ఆకాష్ భాటి(బ్రాంజ్, ఉత్తరప్రదేశ్), మెన్స్ డిస్కస్ త్రోలో ఉజ్వల్(గోల్డ్, జేఎస్‌డబ్ల్యూ),
నాగేంద్ర అన్నప్ప(సిల్వర్, కర్ణాటక), రితిక్(బ్రాంజ్, ఎన్‌సీవోఈ పాటియాల), మెన్స్ హైజంప్‌లో శివభగవాన్(గోల్డ్, హర్యానా), సుదీప్(సిల్వర్, కర్ణాటక), ఎండీ అలీ(బ్రాంజ్, వెస్ట్‌బెంగాల్), ఉమెన్స్ పోల్‌వాల్ట్‌లో కార్తీక వి(గోల్డ్, తమిళనాడు), నేఖా ఎల్దో (సిల్వర్, ఎన్‌సీవోఈ త్రివేండ్రం), వీడీయూ విజయకుమార్(బ్రాంజ్, తమిళనాడు), ఉమెన్ 400 మీటర్ల పరుగుపందెంలో ఆయుషి(గోల్డ్, ఉత్తరప్రదేశ్), ప్రియ(సిల్వర్, కర్ణాటక), సంద్రమోల్ సాబు(బ్రాంజ్, ఎన్‌సీవోఈ, త్రివేండ్రం), మెన్స్‌లో తరణ్దీప్సింగ్(గోల్డ్, పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్), సేతు మిశ్రా (సిల్వర్, బీహార్), అన్కుల్(ఎన్‌సీవోఈ, త్రివేండ్రం) తదితరులు పతకాలు గెలుచుకున్నారు.