ఖిలావరంగల్, ఏప్రిల్ 09 : రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోటలో బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ సన్నాక సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పనిచేస్తోందన్నారు. పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయన్నారు. రాబోయే రజతోత్సవ మహాసభలు కార్యకర్తలకు పండువలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సభకు హాజరయ్యే కార్యకర్తల కోసం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, భోజన సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరిం చారు. అలాగే గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ ఆర్యవైశ్య కమ్యూనిటీ భవనంలో కార్పొరేటర్ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్, నాయకులు సంగరబోయిన ఉమేష్, బిల్ల రాజు, పోలెపాక రాజు తదితరులు పాల్గొన్నారు.