నల్లబెల్లి/వెంకటాపూర్, మే 14 : వడగండ్ల వానకు వరంగల్ జిల్లా నల్లబెల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాలు అతలాకుతలమైంది. పలు గ్రామాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్, నల్లబెల్లి, కొండాపూర్, ఆసరవెల్లి, లక్ష్మీతండా, మూడుచెక్కలపల్లెలో విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. అలాగే, రేకుల షెడ్లు ఎగిపోయి ధ్వంసమయ్యాయి. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.