హనుమకొండ చౌరస్తా, మే 18: విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ గ్రౌండ్స్‌లో నాయిని టీ-10 క్రికెట్ లీగ్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం కావ్య మ్యాచ్‌ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ విప్ రాంచందర్‌నాయక్, మేయర్ గుండు సుధారాణి, ఫైనాన్స్కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.