తాడ్వాయి: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండలంలోని మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు హాజరు కాగా నూనత కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కల్లూరి జయబాబు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా మెన్యం గంగారాం, గౌరవ అధ్యక్షుడిగా సువర్ణపాక పాపారావు,రాష్ట్ర ఉపాధ్యాక్షులుగా ఈసం సురెందర్, సురెంగు సంగు, చీమల సత్యంలు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా బోదెబోయిన పరమేశ్వర్, కొట్నాక బీంరావు, చీమల సత్యం, మూతి బద్రిలు, ట్రెజరర్ సోయం హనుమంతరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు బట్ట నాగేశ్వర్రావును ఎన్నుకున్నారు.
ఎడ్ల తిరుపతి, పసుల సూర్యనారాయణ, వజ్జ వెంకటేశ్వర్లు, మహిళా కార్యదర్శులు ఈక సావిత్రి, కంటెం దేవేంద్ర, కార్యావర్గ సభ్యులుగా భగవంతరావు, పాపయ్య, వీరస్వామి, కిషన్‌రావు, శ్రీనివాస్, నాగయ్య, కిరష్ణ, జ్యోతిరాం, శ్రీనివాస్, కుమారస్వామిలు, అడిట్ కార్యదర్శులుగా బాబురావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాసరావు, వివి ఆదివాసి సంఘాల నాయకులు రాంబాబు, నాగేశ్వర్రావు తదితరులున్నారు.