ములుగు : ములుగు జిల్లా వాజేడు ఎస్సై (Wajedu SI ) రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు ( Suicide ) కారణమైన మహిళను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. వెంకటపురం సీఐ శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నిందితురాలి అరెస్టును వివరించారు. ఈనెల 2న ఎస్సై హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో ( Service Revolver ) కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోతు అనసూయ అనే వీబీఐటీ కళాశాలలో అడ్మిన్స్టాఫ్గా పనిచేస్తున్న మహిళ ఏడు నెలల క్రితం రాంగ్ నంబర్‌తో ఫోన్ చేసి ఎస్సైతో పరిచయం పెంచుకుంది. కొద్ది రోజుల తరువాత తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు పెళ్లి చేసుకోకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని సీఐ వివరించారు.
నిందితురాలి వేధింపులకు, మనోవేదనకు గురై మండపాక శివారులో ఉన్న రిసార్ట్‌లో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆత్మహత్యకు ఆమె ప్రేరేపించడంతోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడని , అన్ని ఆధారాలతో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.