రామప్ప ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ములుగు : ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో్ గుర్తింపు సాధించిన రామప్ప ఆలయాన్ని ఇవాళ ఆమె బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప చెరువు వద్ద మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి వరద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
‘తెలంగాణలో కాకతీయుల కట్టడాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు సీఎం కేసిఆర్ ఉద్యమ కాలం నుంచే ప్రయత్నించారు. కాకతీయులు అద్భుత శిల్ప సంపద తెలంగాణలో ఉంది. రైతుల కోసం కాకతీయులు తవ్వించిన చెరువులను పునరుద్ధరించి ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే. యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, పాండురంగారావు, పాపారావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరికీ ధన్యవాదాలు’ అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆమె వెంట పలు కార్పొరేషన్ల చైర్మన్లు కుసుమ జగదీశ్వర్, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజల సంక్షేమాన్ని కోరని ప్రతిపక్షాలను పట్టించుకోం
అర్హులందరికి రేషన్ కార్డులు : మంత్రి నిరంజన్ రెడ్డి
సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

