ప్రజల సంక్షేమాన్ని కోరని ప్రతిపక్షాలను పట్టించుకోం
మంత్రి జగదీష్ రెడ్డి | పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆకలిని పారద్రోలి.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆకలిని పారద్రోలి.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలను పట్టించుకోని ప్రతి పక్ష నాయకులను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం అంత కన్నా లేదన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి యజమానుల్లా కాకుండా..ఇంకా బానిసలుగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రతి పేదవాడి కడుపు నిండాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఓట్ల రాజకీయం కోసమే
ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో మరో ఆదర్శ పథకంగా దళిత బంధు నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారoజక పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు భరోసాతో జీవిస్తున్నారని మంత్రి తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అర్హులైన 27 వేల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

