Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
Harish rao | 2026లో కాంగ్రెస్ సర్కార్, రేవంత్ ప్రభుత్వం కొత్తగా గెజిట్ ఇచ్చింది.. ఈ గెజిట్ వెనుక ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ (ప్రజా ప్రయోజనం) ఉందా..? ఎక్కడా లేదు.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్... అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
Harish rao | 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై ఆందోళన చెందుతున్న నార్సింగి ప్రజలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కలిసి బాధితులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 ఫీట్ రోడ్ కోసం ఒక మార్కవుట్ ఇచ్చారు. అనంతరం బీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడుండే స్థానికులు అక్కడ గుట్ట మీద హనుమాన్ టెంపుల్ ఉంది.. ఆ 2013లో ఇచ్చిన గెజిట్‌లో ఆ గుట్టను తొలగిస్తూ.. హనుమాన్ టెంపుల్‌ను కూడా తొలగిస్తూ 100 ఫీట్ రోడ్ వేస్తా ఉన్నారు.. ఆ టెంపుల్‌ను కాపాడాలని మా సబితక్క దృష్టికొస్తే.. ఆమె నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి రోడ్డు యదావిధిగా ఉంచుతూ ఆ టెంపుల్‌ను మాత్రం కాపాడుతూ.. ఆ గుడి పక్క నుండి 100 ఫీట్ల రోడ్డు వేసే విధంగా 2018లో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది.. మీ ఎవ్వరి ఇల్లుకు, ఏ అపార్ట్‌మెంట్‌కు కూడా ఇబ్బంది లేదన్నారు.
ఆ పాత గెజిట్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తూ కేవలం టెంపుల్ దగ్గర మాత్రం చిన్న డీవియేషన్.. అక్కన ఓపెన్ ల్యాండ్ ఒకటి ఉంది.. ఓపెన్ ల్యాండ్ నుంచి మెయిన్ రోడ్డుకు కలిపే విధంగా 2018లో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్. ఆ రోజు మేమెందుకు ఇచ్చినం.. పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఒక టెంపుల్‌ను కాపాడాలి.. ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు.. మరి ఈ రోజు 2026లో కాంగ్రెస్ సర్కార్, రేవంత్ ప్రభుత్వం కొత్తగా గెజిట్ ఇచ్చింది.. ఈ గెజిట్ వెనుక ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ (ప్రజా ప్రయోజనం) ఉందా..? ఎక్కడా లేదు.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్… ఒక ప్రత్యేక బిల్డర్ ఇంట్రెస్ట్.. అది ఈ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అని అన్నారు.
ఇవాళ ఎంతమందితో ఆడుకుంటున్నరు.. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మంది నిద్రపోని రాత్రులను గడుపుతున్నామని ఒక సోదరీమణి చెప్తున్నది.. అసలు ఏమవుతామో.. ఏంటో మాకు అర్థమవుతలేదు.. 2 వేల అపార్ట్మెంట్లు 5 వేల మంది ప్రజల జీవితాలతో కేవలం ఒక బిల్డర్ కోసం ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 2026లో కేవలం కాంగ్రెస్ నాయకుల కోసం, RR రియల్ ఎస్టేట్ సంస్థ కోసం అలైన్మెంట్ మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసి, పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రాధా రియల్టర్స్ బిల్డర్ కోసం 2,000 ఇళ్లు కూల్చివేసి 5,000 మందిని రోడ్డున పడేస్తారా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 ఫీట్ల అలైన్మెంట్ ఇచ్చారు
అయితే ఆ అలైన్మెంట్ వల్ల హనుమంతుడి గుడి పోతుందని ప్రజలు చెప్పారు
ప్రజల కోరిక మేరకు 2018లో కేసీఆర్ గారు గుడి కూల్చివేయకుండా, ఇళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు
కానీ 2026లో కేవలం కాంగ్రెస్ నాయకుల కోసం, RR రియల్ ఎస్టేట్ సంస్థ కోసం అలైన్మెంట్ మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు
వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసి, పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

