ములుగు: ములుగు (Mulugu) మండలం కోడిశెలకుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు భూక్య సునీల్(37) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేటు దవఖానలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు.
సాక్షి పత్రికలో ములుగు జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తున్న సునీల్ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీల్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మంత్రి సీతక్క, బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని నాగజ్యోతి పేర్కొన్నారు.