ములుగు : తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే నెల ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు మేడారం మహా జాతర జరుగనున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్మం గళవారం మేడారంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
భక్తులకు కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. భక్తుల సౌకర్యాల కల్పనలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.