కాజీపేట : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా ఖాజీపేట నేతాజీ నగర్ కు చెందిన అబ్దుల్ సత్తార్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలను కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అబ్దుల్ సత్తార్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సాహిర్ (5), ఉదయం లేచి ఇంటి ముందు ఆరు బయటకు వచ్చాడు.
అంతలోనే వీధి కుక్కల గుంపు అటువైపుగా పరిగెత్తు కుంటూ వెళ్లి ఇంటి ముందున్న సాహీర్ పై విచక్షణారహితంగా దాడి చేశాయి. అదే సమయంలో అటుగా పోతున్న స్థానికులు గమనించి బాలుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని దవాఖానకు తరలించారు. శునకాల బారి నుంచి ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పబ్బోజు శ్రీకాంతాచారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా కాజీపేటలో వీధి కుక్కలు కరచిన నా బాలుడికి మెరుగైన వైద్యం అందించాల న్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి , ప్రజలకు భద్రత కల్పించలన్నారు.