రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
డీసీసీబీ చైర్మన్ మార్నేనితో కలిసి చిట్యాలలో డీసీసీ బ్యాంక్ ప్రారంభం
5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాముకు శంకుస్థాపన
డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.5 కోట్ల విలువగల రుణాల చెక్కులు అందజేత
చిట్యాల, ఆగస్టు 23: ఇది మాటల ప్రభుత్వం కాదనీ, చేతల ప్రభుత్వమని, ఏడేళ్లలో చేసిన అభివృద్ధి పథకాలే ఇందుకు నిదర్శమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) చిట్యాల బ్రాంచిని బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. బ్యాంక్ ఆవరణలో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజచేశారు. అనంతరం మార్నేని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), కేంద్ర వ్యవసాయశాఖ గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు సాయం అందజేయడమే కాకుండా రైతుల సౌలభ్యం కోసం సహకార సంఘాల ద్వారా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటలను సాగుచేసి లాభాలు పొందాలని అన్నారు. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్న తెలంగాణను చూసి ప్రతిపక్షాలు విమర్శలతో పబ్బం గడపడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.
కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా డీసీసీబీ
కార్పొరేట్, నేషనల్ బ్యాంకులకు దీటుగా డీసీసీ బ్యాంకులు రూపుదిద్దుకుంటున్నాయని మార్నేని రవీందర్రావు అన్నారు. నిరుద్యోగ యువకులు రుణాలను పొంది గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.850కోట్ల నిధులతో ఉన్న డీసీసీ బ్యాంక్ నేడు రూ.1280కోట్ల టర్న్వర్కు చేరుకుందని తెలిపారు. అనంతరం రూ.5కోట్ల విలువగల రుణాల చెక్కులను, రూ.5.5లక్షల సీఎమ్మాఆర్ఎఫ్ చెక్కులను వివిధ రాకాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపూర్ పీఏసీఎస్ చైర్మన్లు కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, సంపెల్లి నర్సింగారావు, వెంకటేశ్వరరావు, పూర్ణచందర్, ఎంపీపీలు దావు వినోదావీరారెడ్డి, యార సుజాత, రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీలు గొర్రె సాగర్, పులి తిరుపతిరెడ్డి, జోరుక సదయ్య, వైస్ ఎంపీపీ రాంబాబు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గణపతి, సర్పంచ్ పూర్ణచందర్రావు, ఎంపీటీసీలు కట్కూరి పద్మా, దబ్బెట అనిల్, కోఆప్షన్ మెంబర్ రాజ్‌మహ్మద్, మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్, డీఏవో విజయభాస్కర్, డీసీసీబీ మేనేజర్ ఉషా, ఏవో రఘుపతి, ఏపీఎం మంజూల, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.