హైదరాబాద్ : సీఎం మెప్పు పొందడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో చేతిలో ఉందని ఎలా పడితే అలా ప్రవర్తించవద్దు అని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మున్సిపాలిటీల్లో మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ చైర్మన్ స్థానాలను గెలిచింది. జనగామలో గెలిచిన కౌన్సిలర్ ను కాంగ్రెస్ వాళ్లు కిడ్నాప్ చేశారన్నారు.
మేము వెళ్లి గట్టిగా అడిగితే అప్పుడు వదిలేశారు. అధికారులు సరిగ్గా ప్రవర్తిస్తేనే రాజ్యాంగం రక్షించబడు తుందన్నారు. సీఎం ఏమి వ్యాపారవేత్త కాదు..ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినవాడే. కానీ, రైతు బంధు ఎప్పుడూ వేయాలో కూడా తెలియడం లేదననారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంఆ దొంగ వేషాలు వేస్తే ప్రజలు క్షమించరు. రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారని హెచ్చరించారు.