Raja Shivaji | ఛత్రపతి శివాజీగా రితేష్ దేశ్‌ముఖ్.. ‘రాజా శివాజీ’ ఫస్ట్ లుక్ విడుదల!
Raja Shivaji | మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రాజా శివాజీ' (Raja Shivaji) గురించి కీలక ప్రకటన చేశాడు.
Raja Shivaji | మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ (Raja Shivaji) గురించి కీలక ప్రకటన చేశాడు. శివాజీ జయంతి సందర్భంగా అతడికి నివాళులు అర్పిస్తూ.. చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తుండగా.. రితేష్ భార్య, ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ), జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2026 మే 1న (మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. మరాఠీ, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ ఈ సినిమాకు అందిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ వీరగాథను, ఆయన ‘స్వరాజ్యం’ కోసం చేసిన పోరాటాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించనుంది.
Our King. Our Pride. Our Legacy.#RajaShivaji
Chhatrapati Shivaji Maharaj @mfc @jiostudios pic.twitter.com/b82SzZFC8R
— Riteish Deshmukh (@Riteishd) February 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

