పారిశుధ్య నిర్వహణలో జీపీ కార్మికులు భేష్
అలసట లేకుండా గ్రామ పంచాయతీల్లో విధులు
పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనులు
ములుగు, ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ) : పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణే ధ్యేయంగా పారిశుధ్య కార్మికులు గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్నారు. కోడికూతతో మేల్కొని తెల్లవారుజాము నుంచే గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేస్తుంటారు. వీధుల్లో చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రతకు తమవంతు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా గ్రామాల్లో ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ గ్రామపంచాయతీ ఆదేశాలకనుగుణంగా సేవలందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం జీపీ కార్మికుల వేతనాలను మరింత పెంచడంతో వారు సంతృప్తిగా వి ధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అధికారుల నిరంతర పర్యవేక్షణతో జీపీ కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆదర్శం గా నిలుస్తున్నారు.
భేషుగ్గా పారిశుధ్య పనులు
గ్రామాల్లో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు సమకూరాయి. ములుగు జిల్లా కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ కావడంతో ఇక్కడ మొత్తం 60 మంది సిబ్బం ది విధులు నిర్వర్తిస్తున్నారు.14 మంది వాచర్లు, వాటర్మెన్లు మినహాయిస్తే మిగిలిన 42 మంది జీపీ కార్మికులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో ఉన్నా రు. రెండేళ్లుగా కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను అడ్డువేసి మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ సేవలందిస్తున్నారు. చెత్త సేకరణతో పాటు కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను సైతం రూపాయి ఖర్చు లేకుండా దహన సంస్కారాలను సైతం జీపీ కార్మికులే నిర్వహిస్తుండడం విశేషం. ప్రతి రోజూ వీధుల్లో చెత్తను సమయానుసారంగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పారిశుధ్య పనులు కొనసాగుతుండడంతో ములుగు జిల్లా కేంద్రం పరిశుభ్రంగా, సుందరంగా మారింది. దీంతో సీజనల్ వ్యాధులు గతంలో కంటే తగ్గాయి.
అంగడి మైదానంలో సేవలు
ప్రతి ఆదివారం స్థానిక అంగడి మైదానంలో నిర్వహించే సంత కొనసాగుతుంది. ఈ క్రమంలో శని, ఆది వారాల్లో జీపీ కార్మికులు మైదానాన్ని శుభ్రం చేస్తున్నా రు. పండుగలు, ప్రత్యేక రోజుల్లోనూ సేవలందిస్తున్నా రు. వీఐపీల పర్యటనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లలో తమవంతు విధులు నిర్వర్తిస్తున్నారు.