Mulugu | ములుగు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుటకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ బోధనను క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, గుళ్ళపెల్లి సాంబయ్య, వయోజన విద్య జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్, స్థానిక మండల విద్యాశాఖ అధికారి వజ్జ తిరుపతి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ కుమార్, ఝాన్సీ, ఉమాదేవి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.