మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి
మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ముంజాలకుంట తండా, పెద్ద తండా, బూరుగుమళ్ల, మోత్యా తండా, మంగ్త్యాతండా, రావూర్, అన్నారం, కల్లెడ, దూపతండా, పర్వతగిరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ప్రజల రుణం తీర్చుకుంటా.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
- కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దు
- వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్
పర్వతగిరి, నవంబర్ 23: మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ముంజాలకుంట తండా, పెద్ద తండా, బూరుగుమళ్ల, మోత్యా తండా, మంగ్త్యాతండా, రావూర్, అన్నారం, కల్లెడ, దూపతండా, పర్వతగిరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. 24గంటల కరెంట్, రైతుబంధుతో రైతులను, కల్యాణ లక్ష్మీతో ఆడబిడ్డల తల్లిదండ్రులను, పెన్షన్లతో వృద్ధలు, దివ్యాంగులను ఆదుకుంటున్నారని వివరించారు. ఇంకా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. 50ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోక, కమీషన్లకే పరిమితమయ్యారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. కొత్త బిచ్చగాడిలా ప్రతిపక్ష నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారని చెప్పారు. తరిమికొట్టి, నిత్యం అందుబాటులో ఉంటున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు పట్టాపురం ఏకాంతంగౌడ్, ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, బోయినపెల్లి యుగేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ రంగు రజిత, చిన్నపాక శ్రీనివాస్, చీమల భిక్షపతి, ఏర్పుల శ్రీనివాస్, సర్పంచులు ఇందిరా జితేందర్‌రెడ్డి, శోభా పరమేశ్వర్రావు, మాలతీ సోమేశ్వర్రావు, యశోద బాబు, లునావత్ గణేశ్, ఈర్యానాయక్, బండి సంతోష్‌గౌడ్, జ్యోతి రవి, పంజా మహేశ్, పర్వతగిరి ఎంపీటీసీ మాడుగుల రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

