మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ముజావర్లు, శివసత్తులు పీరీలను వీధుల్లో ఊరేగించారు.
ఈ సందర్భంగా భక్తులు ముడుపులు చెల్లించి, కానుకలు సమర్పించారు. అగ్నిగుండ ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పీరీల నిమజ్జనం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్