మృగశిర కార్తె సందర్భంగా మార్కెట్లు, చెరువులు, కుంటల వద్ద సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శనివారం చేపలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సమీప చెరువులు,
కుంటలతోపాటు పట్టణాలు, నగరాల్లో మార్కెట్లకు బారులుతీరారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఆయా చెరువుల వద్దకు వెళ్లి చేపలు కొనుగోలు చేశారు. డిమాండ్‌ను బట్టి మత్య్సకారులు, వ్యాపారులు చేపలను ఎక్కువ ధరకు విక్రయించారు. – నమస్తే తెలంగాణ, నెట్వర్క్