ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మండలంలోని పెద్దమ్మగడ్డలో పాకాల రైతుమిత్ర సంఘానికి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ప్రారంభించారు.
ఖానాపురం, డిసెంబర్ 3 : మండలంలోని పెద్దమ్మగడ్డలో పాకాల రైతుమిత్ర సంఘానికి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
దుగ్గొండి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం గుజ్జుల రాజ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో తేజశ్రీ గామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలన్నారు. ధాన్యం విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. ఏఈవో మౌనిక, ఎంపీటీసీ మామునూరి సుమన్, సీసీ సంధ్యారాణి, వీఏవోలు అరుణ, రవీందర్ పాల్గొన్నారు.
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
నర్సంపేట రూరల్, డిసెంబర్ 3 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ వాసం రామ్మూర్తి, డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి అన్నారు. మండలంలోని కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని బూత్ లెవల్ అధికారులు చేపట్టారు. బీఎల్వోలు దరఖాస్తులను స్వీకరించారు. ఆర్ఐ రజాక్, జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.
చెన్నారావుపేట : యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ అన్నారు. ఉప్పరపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర నాయకులు తాళ్ల రవీందర్, పొన్నం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, సాంబరాజు, కృష్ణ, భిక్షపతి, చిరంజీవి పాల్గొన్నారు.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
దుగ్గొండి, డిసెంబర్ 3 : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై వంగల నవీన్‌కుమార్ సూచించారు. శనివారం మండలంలోని గిర్నిబావి వాహనాలను తనిఖీ చేశారు. ధ్రువీకరణ పత్రాలు లేనివారికి జరిమానా విధించారు. హెల్మెట్ లేని వాహనదారులకు కౌన్సెలింగ్ చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

