మహబూబాబాద్ : భూమి లేఅవుట్ అభివృద్ధి పనులకు లంచం తీసుకున్న ముగ్గురిని ఏసీబీ ( ACB ) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సిములపేట మండలానికి చెందిన ఎంపీడీవో రాధిక ( MPDO Radhika ), ఆమె కుమారుడు నాగార్జున, ఎంపీవో యాకయ్య ( MPO Yakaiah ) పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వివరాలు.. మండలంలోని పద్మావతిగూడెం గ్రామంలో లేఅవుట్‌కు సంబంధించిన భూమిని గ్రామ పంచాయతీ వద్ద తాకట్టు పెట్టేలా పంచాయతీ సచివాలయానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాధితుడు ఎంపీడీవో రాధికను, ఎంపీవో యాకయ్యను సంప్రదించాడు. దీంతో వారు లంచం డిమాండ్ చేయడంతో శుక్రవారం ఎంపీడీవో కుమారుడు నాగార్జునకు మొత్తం 45 వేల రూపాయలు అందజేశాడు.

దీంతో అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ముగ్గురిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి వరంగ్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఎంపీడీవో రాధిక ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో స్థానికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.