హనుమకొండ, అక్టోబర్ 16: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్(National Athletics) పోటీలు ప్రారంభమయ్యాయి. నువ్వా నేనా అన్నట్లు అథ్లెట్లు సింథటిక్ ట్రాక్‌పై చిరుతల్లా పరుగులు తీశారు. బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన అథ్లెట్లు దూసుకెళ్లారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభను చాటారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య పోటీలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అథ్లెట్లు ఒలంపిక్స్‌లో పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
ఖేలో ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లో ఒలంపిక్స్ పోటీలుజరిగే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు, ఇటీవల ఎంపీలందరం పీటీ ఉషను కలిసినట్లు ఆమె గుర్తుచేశారు. మన క్రీడాకారులు ఒలంపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చాలా ఇంట్రెస్ట్‌తో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ స్పిరిట్‌తో క్రీడాకారులు ప్రతిభను చూపాలని, వరంగల్‌లో నేషనల్స్ జరగడం క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు.
అనంతరం 10 వేల మీటర్ల పరుగుపందెంలో ప్రతిభచాటిన అథ్లెట్లకు ఎంపీ కావ్య, మేయర్ సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ అజిజ్ఖాన్, తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలీజోన్స్, తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడిపాటి వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ పుల్యాల కిషన్కోచ్లు శ్రీమన్నారాయణ, నాగరాజు, ఐలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.