కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్ద తు ధర లభిస్తున్నదని ఎంపీపీ అన్నమనేని అప్పారావు సూచించారు.
- ఎంపీపీ అన్నమనేని అప్పారావు
వర్ధన్నపేట, నవంబర్ 24 : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్ద తు ధర లభిస్తున్నదని ఎంపీపీ అన్నమనేని అప్పారావు సూచించారు. మండలంలోని ఇల్లంద వ్యవసాయ మా ర్కెట్ యార్డులో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మార్గం భిక్షపతితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా.. సీఎం కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. రైతులు నిబంధనలు పాటించి నిర్వాహకులకు సహకరిస్తూ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, ఏఎంసీ కమిటీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
నెక్కొండలో..
నెక్కొండ: మండలంలోని అప్పల్‌రావుపేటలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాసం రమాదేవి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గ్రామ అధ్యక్షుడు దామోదర్, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, నాయకులు ఈదునూరి యాకయ్య, ఈదునూరి రమేశ్, బానోత్ వాగ్యానాయక్, వడ్డె వేణుగోపాల్, ఊడుగుల సారయ్య పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
ఖిలావరంగల్: దళారులను నమ్మి మోసపోవద్దని 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, పీఏసీఎస్ చైర్మన్ కే జనార్దన్ సూచించారు. గురువారం బొల్లికుంటలోని రైతువేదిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌కు రూ. 2060, బీ గ్రేడ్‌కు రూ.2040 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించిందన్నారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ రామస్వామి, ఏఈవో సత్యప్రకాశ్, ఏఎంసీ డైరెక్టర్ తుమ్మ రవీందర్‌రెడ్డి, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ప్రసాద్, డివిజన్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) యూత్ అధ్యక్షుడు సోల్తీ నరేందర్, డైరెక్టర్ వేమనరెడ్డి, భిక్షపతి, పరశురాములు, కృష్ణారెడ్డి, వీరారెడ్డి, ఎల్లాగౌడ్, సరిత, సమ్మక్క, రాజేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
గీసుగొండ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కార్పొరేటర్ ఏ మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ డీ రమేశ్ సూచించారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం వారు ప్రారంభించారు. రైతుబంధు సమితి కన్వీనర్ గజ్జి రాజు, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అధికారి వినోద్, ఏవో హరిప్రసాద్‌బాబు, డైరెక్టర్లు రాజు, అశోక్, శ్రీనివాస్, స్వామి, రవి, కిషన్, స్వామి, రవి, సతీశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చెన్నారావుపేట : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ పత్తినాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చెన్నారావుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చెర్మన్ ముద్దసాని సత్యనారాయణ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సొసైటీ సిబ్బంది రాఘవులు, సొసైటీ డైరెక్టర్ మహేందర్, శ్రీనివాస్, ఉప సర్పంచ్ రవీందర్, సీతారామరావు, వీరస్వామి, ప్రతాప్‌రెడ్డి, దేవేందర్, బాల కొమురయ్య, రాజేశ్వర్‌రావు, బలరాం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నర్సయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

