పోచమ్మమైదాన్, అక్టోబర్ 23 : కేంద్ర ప్రభుత్వం చేనేత ముడి సరుకులు, వస్ర్తాలపై విధించనున్న జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మేయర్ గుండు సుధారాణి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆదివారం పెద్దఎత్తున పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కార్డులపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేనేత ముడిసరుకులు, వస్ర్తాలపై పన్నులను పెంచలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల సంక్షేమ కోసం చేనేత బీమా, చేనేత మిత్ర, నేతన్నలకు చేయూత పథకాలను అమలు చేస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం జీఎస్టీని పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నగరంలోని కొత్తవాడ, వీవర్స్‌కాలనీ, కాశీబుగ్గ, ఎస్ఆర్ఆర్ తోట, వెంకటేశ్వరపల్లి తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని, కేంద్రం నిర్ణయం వల్ల వీరికి తీరని నష్టం జరుగుతుందన్నారు. వెంటనే జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, తెలంగాణ పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, జిల్లా కో ఆర్డినేటర్ వడ్నాల నరేందర్, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, గుండు చందన, యువజన సంఘం నాయకులు గుండు విజయరాజ్, మాజీ కార్పొరేటర్లు యెలుగం శ్రీనివాస్, యెలుగం లీలావతి, డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజ్, నాయకులు డాక్టర్ గడ్డం భాస్కర్, చిప్ప వెంకటేశ్వర్లు, కటకం విజయ్‌కుమార్, సీపీఐ నాయకులు వెంక్రటాములు, చేనేత సంఘాల ప్రతినిధులు పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, యెలుగం వెంకటమల్లు, యెలుగం పెద్ద భద్రయ్య, యెలుగం చిన్న కొమురయ్య, యెలుగం సాంబయ్య, యెలుగం చిన భద్రయ్య, దువ్వల రాజేందర్, అడిగొప్పుల సంపత్, కూరపాటి సంపత్, పరికిపండ్ల రమేశ్, యెలుగం కమలాకర్, కూచన ఓదెలు, బూర వేణు, కోడూరి రమేశ్, యెలుగం శ్రీకాంత్, సుధాకర్, ఓం ప్రకాశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీని రద్దు చేయాలి..
గిర్మాజీపేట : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ డిమాండ్ చేశారు. జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ పద్మశాలి సంఘం సభ్యులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను ఇప్పటికే కేంద్రం రద్దు చేసిందన్నారు. ఇది చాలదన్నట్లు చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం ప్రధాని మోదీకే చెల్లిందని విమర్శించారు. జీఎస్టీని రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
‘ఆగం చేస్తున్న కేంద్రం’
కొడకండ్ల : చేనేత ముడి సరుకులపై కేంద్ర ప్రభు త్వం పన్నులు విధించి, చేనేత వృత్తిని ఆగం చేస్తోందని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ విమర్శించారు. మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన నియోజకవర్గ పద్మశాలి ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధిచండం సరికాదని పేర్కొన్నారు. జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఉత్తరాలు రాసి ప్రధానికి చేరవేయాలని సూచించారు. పద్మశాలి సంఘం సభ్యు లు వేముల బాలరాజు, ఎంపీపీ ధరావత్ జ్యోతి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు సిందే రామోజీ, నజీర్, యూత్ మండలాధ్యక్షుడు దేశగాని సతీశ్, పసునూరి నవీన్, దోర్నం ప్రభాకర్, మసురం రమేశ్, మసురం వెంకటనారాయణ, భారత శ్రీను పాల్గొన్నారు.