కరీమాబాద్ అక్టోబర్ 15 : రవాణా శాఖలో సేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం నుంచి రవాణా శాఖ సైట్ పనిచేయకపోవడంతో వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చిన సిబ్బంది గంటలు తరబడి వేచి ఉన్నారు.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సారధి వలన ప్రతిరోజు వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. అధికారులు చర్యలు చేపట్టి తమ కష్టాలు తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.