జనగామ రూరల్ : జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నమనీ పెంబర్తి జామియా మజీద్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ తెలిపారు. శుక్రవారం జనగామ మండలం పెంబర్తి గ్రామంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ సామాన్యులపై ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదులను వారి హింసాత్మక చర్యలను యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తోందనారు. దాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేరన్నారు.
భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసే చర్యలకు పూనుకోవాలనారు. ఈ దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి భగవంతుడు మనోధైర్యాన్ని శక్తిని కల్పించాలని గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ ఉప అధ్యక్షుడు ఆరిఫ్, ఇబ్రహీం, ఖదీర్, అంజద్, తాహెర్, సల్మాన్, ఆసిఫ్, ఖలేక్, సమీర్, సలీం, అహ్మద్, చోటేమియా, ముబారక్, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.