ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి జోరు వాన కురిసింది. ములుగు, ఏటూరునాగారం, వాజేడు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, చిల్పూర్, జఫర్‌గఢ్, వరంగల్ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ వద్ద వేసిన టెంట్లు గాలిదుమారానికి కూలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నం చేశారు.
– నమస్తే నెట్వర్క్, మే 12