భీమదేవరపల్లి, జూలై 09: ఇటీవల జరిగిన కాకతీయ యూనివర్సిటీ 23 వ స్నాతకోత్సవంలో భాగంగా గణిత శాస్త్రంలో రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ చేతుల మీదుగా రవీందర్ రెడ్డి డాక్టరేట్ పొందారు. Mathematical modelling of decision making optimisation problems under fuzzy environment అనే అంశంపై రవీందర్ రెడ్డి సిద్ధాంత గ్రంథం రాశారు.
రవీందర్ రెడ్డి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్లో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పొందిన రవీందర్ రెడ్డిని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెహమాన్ ఉపాధ్యాయులు స్వరూప, ఆచరిత, వెంకట్, ప్రసాద్, రమన్, శ్రీనివాస్, రమాదేవి, శ్రీవాణి, పద్మ, రమేష్, విశాల్ తదితరులు ఘనంగా సన్మానించారు.