మహబూబాబాద్ రూరల్, మే 26 : మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ప్రజలకు సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కోరారు. సోమవారం రైల్వే అధికారులతో కలిసి స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైల్వేస్టేషన్ పట్టణం నడిబొడ్డున ఉన్నందున పాత బజార్, కొత్త బజార్ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం స్టేషన్లో మూడవ లైన్ పనులు జరుగుతున్నాయని, దీనికనుగుణంగా నాల్గో ప్లాట్‌ఫాం నిర్మించపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
స్టేషన్ నుంచి బయటకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్నారు. మానుకోట ప్రాంతంలో అధిక సంఖ్యలో గిరిజనులు, మార్వాడీలు ఎక్కువగా ఇక్కడినుంచే వ్యాపారాలు చేస్తున్నారని, వారికి ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాల వైపు వెళ్లేందుకు రైళ్లకు స్టేషన్లో హాల్టింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్, ఖమ్మం స్టేషన్లో కంటే కూడా మానుకోటకు ఎక్కువ ఆదాయం వస్తున్నందున ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు.
మహిళా ప్రయాణికులకు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, సరిపడా మరుగుదొడ్లు కట్టించాలని సూచించారు. స్టేషన్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న మూడో లైన్ పనులు వేగంగా పూర్తి చేసి రైల్వే స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పనుల పర్యవేక్షణకు వచ్చిన సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం రాధాకృష్ణన్‌కు ఎమ్మెల్సీ రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి స్టేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మంగళంపల్లి కన్న, కరుణాకర్‌రెడ్డి, వెంకటాద్రి, అంబరీష, రామక్రిష్ణ, మడత వెంకన్న, శిక, గోపి, శంకర్ పాల్గొన్నారు.