హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11: కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. అలాగే రాష్ర్టంలో వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంలో శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని ఆందోళన చెందవద్దని హామీనిచ్చారు.
అంతకుముందు కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు నుంచి రాష్ర్ట కోఆర్డినేషన్ కమిటీ పిలుపులో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం కేయూ కోఆర్డినేషన్ కమిటీ నేతలు పి.కరుణాకర్‌రావు, శ్రీధర్ కుమార్ లొద్, సాదు రాజేష్, బైరి నిరంజన్, మాదాసి కనకయ్య, బి సతీష్, నిరంజన్, ఆశీర్వాదం, సంకినేని వెంకన్న, బిక్షపతి, ఫిరోజ్, ఆరూరి సూర్యం, గడ్డం కృష్ణ, జూల సత్య, సూర్యనారాయణ, నాగయ్య, చంద్రశేఖర్, రఘువర్ధన్‌రెడ్డి, కవిత, శ్రీదేవి, స్వప్న, వీణ, సునీత, సుచరితపాల్, సుజాత, శ్రీలత, సంగీత్ కుమార్, బ్లెస్సీ ప్రియాంక, ఉషా, కల్పన, కిరణ్, వాణిశ్రీ, స్వామి, సదాశివ, తూర్పాటి వెంకటేశు, ఆర్ డి ప్రసాద్, సత్యనారాయణ, వందన పాల్గొన్నారు.