మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని యూత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. నూతన సాంకేతిక విధానాలకు అనుగుణంగా పాఠశాలలో విద్యార్థులకు బోధించాలని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని పేర్కొన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సులభమైన రీతిలో బోధన అందించి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, ఆర్పీలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.