MLC Ravinder Rao | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ స్టేషన్లలో మూడో లైన్ రైల్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్ లో ప్రజలకు అవసరమైన విశ్రాంత గదులను పరిసరాల పరిశుభ్రత, ప్లాట్ఫామ్ పొడిగింపు, ఫుడ్ పవర్ బీచ్ నిర్మాణం నాలుగో నంబర్ ప్లాట్ ఫామ్ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పారు.
అనంతరం రైల్వే స్టేషన్ అధికారులతో సమస్యల పైన చర్చించారు. రైల్వే స్టేషన్ లో సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.