మహబూబాబాద్ రూరల్/దంతాలపల్లి, ఫిబ్రవరి 22 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 24న మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. కేసముద్రం, కురవి, మరిపెడ, దంతాలపల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నా రు. దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చిర్ర సతీశ్ (దివ్యాంగుడు)కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కవిత సతీశ్‌కు సహాయం చేస్తానని హామీ ఇచ్చింది.
ఇచ్చిన మాట ప్రకారం రామానుజపురం గ్రామంలో ఎమ్మెల్సీ కవిత సౌజన్యంతో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌ను సోమవారం ఉదయం 9.00 ప్రారంభించనున్నారు. 9.45 గంటలకు మరిపెడ మండలం చిల్లంచర్లలో జాగృతి నాయకురాలు మరిపెల్లి మాధవి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు కురవి వీరభద్రస్వామి దర్శనం, 11.15 గంటలకు మానుకోట మిర్చియార్డ్ సందర్శన, మధ్యాహ్నం పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. 1.20గంటలకు కేసముద్రం మండలం అన్నారంలో సింగర్ మానుకోట ప్రసాద్ ఇంటిని సందర్శిస్తారు.