గోవిందరావుపేట/ములుగు రూరల్, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.
మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళహారతులతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ క్రమం లో బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆర్ అని ని నాదాలు చేస్తుండటంతో ఎమ్మెల్సీ కవిత సైతం వారితో నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నిం పారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజ లు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, ఎక్కడికి వెళ్లిన కేసీఆర్‌ను దేవుడిగా కొలుచుకుంటున్నారని అన్నారు.
అలాగే జిల్లా కేంద్రంలో జడ్పీ మా జీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో నాయకులు పోరిక గోవింద్‌నాయక్, పోరిక విజయ్‌రామ్‌నాయక్, కోగిల మహేశ్, గునిగంటి హరీశ్, నాజర్‌ఖాన్, హరిలాల్, గునిగంటి హరీశ్ తదితరులు కవితకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.