స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 27 : డివిజన్లోని నమిలిగొండ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 11వ రోజు పోటీలను మంగళవారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరిశీలించారు. ముందుగా కడియం యువసేన సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఉదయం క్రీడలను సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య, జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న టాస్ వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కడియం మాట్లా డుతూ.. యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓడిన వారికి కూడా క్రీడల్లో పాల్గొన్నామనే గుర్తింపు కోసం కడియం ఫౌండేషన్ ద్వారా మెమెంటోలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బానోత్ రాజేశ్‌నాయక్, చిల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, దేవేందర్, సర్పంచ్‌లు కోతి రేణుకారాములు, గాదేపాక అనితాసుధాకర్బాబు, పార్వతీరవినాయక్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, ఎడ్ల వెంకటస్వామి, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, కడియం యువసేన నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి హఫీజ్, ధర్మసాగర్, చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాల అధ్యక్షులు ప్రవీణ్, విజయ్, అశోక్, సభ్యులు బూర్ల రాజు, నాగరాజు, సంపత్‌రాజ్, వెంకటేశ్ పాల్గొన్నారు.